ఆలియా.. అదిరే ఆటయా | SS Rajamouli To Add A Special Song For Alia Bhatt In RRR Movie | Sakshi
Sakshi News home page

ఆలియా.. అదిరే ఆటయా

Published Fri, Jan 31 2020 2:50 AM | Last Updated on Fri, Jan 31 2020 2:50 AM

SS Rajamouli To Add A Special Song For Alia Bhatt In RRR Movie - Sakshi

ఆలియా భట్‌

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు ఆలియా భట్‌. ఇందులో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారామె. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లోనే కాదు.. ఆలియా భట్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లోనూ కనిపిస్తారని తెలిసింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి ఈ పీరియాడిక్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొమరమ్‌ భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆలియా పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. అయితే ఆమె పై ఓ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తే బావుంటుందని చిత్రబృందం భావించారని టాక్‌. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటను చిత్రీకరిస్తారట. ఈ పాటకు ఆదిరిపోయే రేంజ్‌లో ఆలియా స్టెప్పులేస్తారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement