వెల్‌కమ్‌ టు పుణె | RRR movie next schedule shooting at Pune | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్‌ టు పుణె

Published Mon, Nov 30 2020 12:19 AM | Last Updated on Mon, Nov 30 2020 12:19 AM

RRR movie next schedule shooting at Pune - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ఇద్దరూ పుణె ప్రయాణం అయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసమే ఈ ప్రయాణం అని అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో కొమరం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ పుణెలో జరగనుందని సమాచారం. సుమారు వారం పాటు ఈ షెడ్యూల్‌ సాగనుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ పాల్గొంటారని తెలిసింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్‌ కెమెరామేన్‌. ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement