పద్మ విజేతలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: వివిధ రంగాల్లో విశేష కృషి చేసి పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజంలో ఎంతో సేవలందించిన రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం సముచితమన్నారు. క్రీడల్లో హైదరాబాద్ పేరు నిలబెడుతున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వైద్య రంగంలో సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిలకు పద్మ భూషణ్ పురస్కారం రావడం వల్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
పద్మశ్రీకి ఎంపికైన సినీ దర్మకుడు రాజమౌళి, కె.లక్ష్మణ్‌గౌడ్ (ఆర్ట్ పెయింటింగ్), డాక్టర్ మన్నం గోపీచంద్ (కార్డియో థోరాసిక్ సర్జరీ), డాక్టర్ టి.వి.నారాయణ (సామాజిక సేవ), ఆల్ల గోపాలకృష్ణ గోఖలే (కార్డియాక్ సర్జరీ)లకు సీఎం అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన పండిట్ రవిశంకర్, రజనీకాంత్, పద్మ భూషణ్‌కు ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.