ఇద్దరూ ఇద్దరే | Rajamouli , NTR and Charan Movie To be Titled as Iddaru Iddare | Sakshi
Sakshi News home page

ఇద్దరూ ఇద్దరే

Published Wed, Jan 17 2018 12:28 AM | Last Updated on Wed, Jan 17 2018 12:28 AM

Rajamouli , NTR and Charan Movie To be Titled as Iddaru Iddare - Sakshi

...ఈ టైటిల్‌ వినగానే శోభన్‌బాబు–కృష్ణంరాజు (1976), అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున(1990) నటించిన సినిమాలు గుర్తుకు రాకమానవు. ఇప్పుడు మరోసారి ఈ టైటిల్‌ తెరపైకి వచ్చింది. ‘బాహుబలి’ వంటి విజువల్‌ వండర్‌ తర్వాత రాజమౌళి నెక్ట్స్‌ రామ్‌చరణ్‌–ఎన్టీఆర్‌తో ఓ మల్టీస్టారర్‌ మూవీ చేసే ప్లాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఫిల్మ్‌నగర్‌లో ప్రచారమవుతున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘ఇద్దరూ ఇద్దరే’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్‌–చరణ్‌లకు ఈ చిత్రంలో సమ ప్రాధాన్యత ఉంటుందట.

అందుకే ఏ టైటిల్‌ అయితే బాగుంటుందా? అని ఇద్దరు హీరోలకు సరిపడేలా ‘ఇద్దరూ ఇద్దరే’ అనుకుంటున్నారట. ప్రస్తుతం ‘రంగస్థలం’ షూటింగ్‌లో ఉన్న రామ్‌చరణ్‌ తర్వాతి సినిమాని బోయపాటి శ్రీనుతో చేయనున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేయనున్న సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ హీరోలిద్దరూ ఈ చిత్రాలు చేసేలోపు రాజమౌళి ప్లానింగ్‌లో ఉంటారట. ఆ తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్‌ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అవుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement