గురూ... యాక్షన్‌ షురూ | NTR Ramcharan is a multi starrer movie starring Rajamouli | Sakshi
Sakshi News home page

గురూ... యాక్షన్‌ షురూ

Published Fri, Feb 22 2019 12:40 AM | Last Updated on Fri, Feb 22 2019 3:36 AM

NTR Ramcharan is a multi starrer movie starring Rajamouli - Sakshi

మళ్లీ ఫైటింగ్‌ షురూ చేశారట ఎన్టీఆర్‌ అండ్‌ రామ్‌చరణ్‌. ‘బాహుబలి’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌)’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ఈ మల్టీస్టారర్‌ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌పై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మళ్లీ ఇప్పుడు షూటింగ్‌ షురూ చేసింది.

ఈ సెట్‌లోకి గురువారం ఎన్టీఆర్‌ ఎంటరయ్యారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటుగా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఫస్ట్‌ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తీశారు. తాజా షెడ్యూల్‌లో కూడా వీరి కాంబినేషన్‌లో ఓ భారీ ఫైట్‌ తీయబోతున్నారట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్‌ భామలు ఆలియా భట్, పరిణీతీ చోప్రాల పేర్లు తెరపైకి వచ్చాయి. సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ పీరియాడికల్‌ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement