
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్‌ఆర్‌ఆర్' వాయిదా పై స్పంధించారు. తాజాగా 'రౌడీ బాయ్స్' చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్ళాడు ఈ హీరో. ఇక ఈవెంట్‌లో రామ్ చరణ్ చరణ్ మాట్లాడుతూ.. మా సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాకపోయినా మాకేం బాద లేదు. ఎందుకంటే అలాంటి చిత్రం సరైన సమయంలో రావాలి. ఆ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. దాని గురించి దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని పేర్కొన్నాడు.
మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో కాదో మాకు తెలీదు కానీ.. సంక్రాంతి పండుగకి దిల్ రాజు గారు మాత్రం చాలా ముఖ్యం. సంక్రాంతి మమ్మల్ని వదులుకోడానికైనా రెడీగా వుంది కానీ దిల్ రాజుని వదులుకోడానికి రెడీగా లేదు. ఇలాంటి సక్సస్ ఫుల్ సంక్రాంతులు ఎన్నో దిల్ రాజు చూసాడు. ఈ సంక్రాంతి కూడా ఆయనదే అవ్వాలన్నాడు చెర్రి. ఇక మమ్మల్ని ఆదరించినట్టే 'రౌడీ బాయ్స్' చిత్ర హీరో ఆశీష్‌ను కూడా ఆశీర్వధించాలని రామ్ చరణ్ కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment