బోస్ కాలంలో రానా | Rana Daggubati in 1945 | Sakshi

బోస్ కాలంలో రానా

Aug 18 2016 11:27 AM | Updated on Sep 4 2017 9:50 AM

బోస్ కాలంలో రానా

బోస్ కాలంలో రానా

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. కమర్షియల్ హీరో ఇమేజ్ కోసం పాకులాడకుండా.. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో డిఫరెంట్ సినిమాకు అంగకీరించాడు. ప్రస్తుతం ఇండియాస్ బిగెస్ట్...

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. కమర్షియల్ హీరో ఇమేజ్ కోసం పాకులాడకుండా.. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో డిఫరెంట్ సినిమాకు అంగకీరించాడు. ప్రస్తుతం ఇండియాస్ బిగెస్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న బాహుబలి పార్ట్ 2లో నటిస్తున్న ఈ మ్యాన్లీ హంక్, ఆ సినిమాతో పాటు భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరోసారి ప్రయోగానికే రెడీ అవుతున్నాడు రానా.

1940లలో జరిగే కథతో తెరకెక్కనున్న సినిమాలో రానా ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో భారత స్వతంత్ర సమరయోథుడు సుభాష్ చంద్రబోస్ పాత్రతోనూ రానాకు కొన్ని కీలక సన్నివేశాలను ఉండనున్నాయట. సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటులు నాజర్, కరుణలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement