ఏడు దశాబ్దాలు వెనక్కి! | Regina Cassandra to play the lead in Rana's film | Sakshi
Sakshi News home page

ఏడు దశాబ్దాలు వెనక్కి!

Published Sun, Aug 7 2016 11:54 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ఏడు దశాబ్దాలు వెనక్కి! - Sakshi

ఏడు దశాబ్దాలు వెనక్కి!

రానా.. రెజీనా.. అన్నీ సవ్యంగా కుదిరితే ఇప్పటికే ఈ జోడీని తెరపై చూసేవాళ్లం. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా ఓ చిత్రం ప్రారంభమైంది. అనివార్య కారణాల వలన ఆ చిత్రం మధ్యలోనే ఆగింది. ఇన్నాళ్లకు మళ్లీ ఈ జోడీ కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో  సత్యశివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా, రెజీనా జంటగా నటించనున్నారు. తమిళ చిత్రానికి ‘మడై తిరందు’ తెలుగుకి ‘1945’ అనే టైటిల్‌ని ఖరారు చేశారట. 1940లలో జరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా వివిధ గెటప్పుల్లో కనిపిస్తారట. 
 
‘బాహుబలి: ది కంక్లూజన్’లో భల్లాలదేవుడి పాత్ర కోసం రానా కండలు తిరిగిన దేహంతో పాటు గడ్డం కూడా బాగా పెంచారు. ‘1945’లో ఓ గెటప్ ఈ భల్లాలదేవుడి గెటప్ తరహాలో ఉంటుందట. ఈ నెల 20న  ఈ చిత్రం షూటింగ్  ప్రారంభించాలనుకుంటున్నారట. ఏడు దశాబ్దాల క్రితం జరిగిన కథతో సినిమా కాబట్టి రానా, రెజీనా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement