ప్రేమ పెళ్లి వల్ల... | Regina's Nirnayam to be dubbed in Telugu | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి వల్ల...

Published Wed, Sep 24 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ప్రేమ పెళ్లి వల్ల...

ప్రేమ పెళ్లి వల్ల...

ఓ పెద్దింటి కుర్రాడు, ఓ పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి పెద్దలు సమ్మతించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘నిర్ణయం’ పేరుతో విడుదల కానుంది. రాణా విక్రమ్, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.వై.ఎస్. చౌదరి సమర్పణలో కె. జ్యోత్స్నరాణి, యం. లక్ష్మీ, సురేఖ తెలుగులోకి అనువదించారు. సెల్వగణేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత అశోక్‌కుమార్ ఆవిష్కరించి,  దర్శకుడు సాగర్‌కి ఇచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మంచి కథాంశంతో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. రెజీనా అందచందాలు, అభినయం ఓ హైలైట్. బేబి వేదిక పోషించిన పాత్ర కీలకంగా నిలుస్తుంది. మంచి పాటలు కుదిరాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement