కేడీతో లేడీ | Successful director pandiraj Sivakarthikeyan, Regina | Sakshi
Sakshi News home page

కేడీతో లేడీ

Published Fri, Dec 11 2015 11:54 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

కేడీతో లేడీ - Sakshi

కేడీతో లేడీ

 సక్సెస్‌ఫుల్ డెరైక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది, ఘన విజయం సాధించిన చిత్రం ‘కేడీ బిల్లా - కిలాడీ రంగా’. విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి ఇందులో హీరో హీరోయిన్లు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. సమర్పకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ -‘‘నా అభిమాన నిర్మాతల్లో తుమ్మలపల్లి ఒకరు.

 ఆయనతో అసోసియేటవ్వాలని చాలా రోజులుగా అనుకున్నా. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు. ‘‘రెజీనా, బిందుమాధవిల అందాలు, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.సత్యనారాయణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement