కమల్‌ హాసన్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి: ‘అమరన్‌’ డైరెక్టర్‌ | Director Rajkumar Periasamy Interesting Comments About Amaran Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి: ‘అమరన్‌’ డైరెక్టర్‌

Published Wed, Nov 6 2024 10:14 AM | Last Updated on Wed, Nov 6 2024 12:22 PM

Rajkumar Periasamy Talk About Amaran Movie

‘అమరన్‌’ విడుదలకు ముందు కమల్‌ హాసన్‌ గారికి సినిమా మొత్తం చూపించాను. ఆయన చాలా ఎమోషనల్‌ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను’అన్నారు డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్‌’. ఆర్‌. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కమల్‌ హాసన్‌  ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

అమరన్‌ చిత్రానికి అన్ని చోట్ల హిట్‌ టాక్‌  రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది.        

ఈ చిత్రానికి కమల్‌ హాసన్‌ చాలా సపోర్ట్‌ చేశారు.నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.

ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై ఉన్న క్యారెక్టర్ అది.

అయితే ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయను తీసుకోవాలని మొదట్లో అనుకోలేదు. ఓసారి ఆయనకు కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్ ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.

ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్ కి ఎంగేజింగ్ చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ ని  బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్ ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.

యాక్షన్స్ సీక్వెన్స్లు చేయడం, అలాగే కాశ్మీర్‌లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్ తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్ ని క్లియర్ గా రాసుకున్నాను. ప్రతి షాట్ ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.

ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement