‘గూఢచారి’ తరువాత..! | Adivi Sesh Next Movie Starts Rolling | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 9 2018 2:06 PM | Last Updated on Thu, Aug 9 2018 2:06 PM

Adivi Sesh Next Movie Starts Rolling - Sakshi

గూఢచారి సక్సెస్‌తో యంగ్ హీరో అడివి శేష్‌ హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. బడా నిర్మాణ సంస్థలు ఈ యంగ్ హీరోలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. అయితే శేష్‌ మాత్రం తన స్టైల్‌లో కూల్‌గా మరో సినిమా పనుల్లో బిజీ అయినట్టుగా తెలుస్తోంది. క్షణం సినిమా తరువాత గూఢచారి తెరకెక్కించేందుకు గ్యాప్ తీసుకున్న శేష్‌ ఈ సారి వెంటనే మరో సినిమా ప్రారంభించనున్నాడు.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అడివి శేష్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు కూడా శేష్‌ కేవలం కథా కథనాలు మాత్రమే అంధించనున్నాడు. రామ్‌ జీ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌ గా నటించనుంది. ప్రస్తుతానికి క్షణం 2 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను క్షణం చిత్రాన్ని నిర్మించిన  పీవీపీ సంస్థే నిర్మించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement