ఓ మిషన్ మీద ఒక గూఢచారి ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు వెళతాడు. ఆ మిషన్ ఏంటి? ఎలా విజయం సాధించాడు? అనేవి తెలియడానికి ఇంకా సమయం ఉంది. గూఢచారి పాత్రలో అడివి శేష్ హీరోగా రపొందనున్న చిత్రం ‘గఢచారి 2’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ప్రీ విజన్ వీడియోను రిలీజ్ చేశారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ రూపొందనుంది.
కాగా తొలి భాగం భారతదేశంలో జరిగితే రెండో భాగం కథ ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు ప్రయాణిస్తుంది. అడివి శేష్ కథ అందించిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ వినయ్ కువర్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment