హీరోయిన్ సునయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెజీనా. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన డోమిన్ టి.సిల్వా ఈ మూవీని తెరకెక్కించారు. ఎలో బీయర్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష నాయర్ నిర్మించి, సంగీతాన్ని అందించారు. భవీ కె.భవన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన రెజీనా చిత్ర టీజర్ మే 30వ తేదీన విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం స్థానికరాయపేటలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాత టి.శివ, చిత్రా లక్ష్మణన్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, శక్తి పిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తివేలన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేదికపై సునయన మాట్లాడుతూ.. 2006లో అమ్మానాన్నల మధ్య కూర్చొని టీవీ సీరియల్స్ చూసే చిన్న అమ్మాయినని, అప్పట్లో తనకు నటిగా రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సెలవులకు హైదరాబాద్ వెళ్లినప్పుడు చంద్రముఖి, గజిని చిత్రాలను చూశానని తెలిపారు. ఆ సమయంలో దక్షిణాది సినీ కథానాయిక అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అప్పుడు సినిమాపై పెంచుకున్న ఆసక్తి, సిన్సియారిటీ, నిజాయితీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నానన్నారు. ఈ చిత్ర దర్శకనిర్మాతల దగ్గర నుంచి యూనిట్‌లో ప్రతి ఒక్కరికీ సమైక్యత ఉందని సునయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment