కీలకమైన మలుపు | Regina's Tamil movie dubbing into Telugu | Sakshi
Sakshi News home page

కీలకమైన మలుపు

Published Wed, Sep 17 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

కీలకమైన మలుపు

కీలకమైన మలుపు

ఓ గొప్పింటి అబ్బాయి, ఓ పేదింటి అమ్మాయి ప్రేమలో పడతారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించరు. దాంతో ఇద్దరూ ఇల్లు వదిలి, ఊరు వదిలి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరి జీవితాలు ఓ కీలకమైన మలుపు తిరుగుతుంది. అదేంటో తెరపై చూడాలంటున్నారు దర్శకుడు శరవణన్. రాణా విక్రమ్, రెజీనా జంటగా తమిళంలో రూపొందిన చిత్రాన్ని ‘నిర్ణయం’ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఎ.వై.ఎస్. చౌదరి సమర్పణలో కె.జోత్న్సారాణి, ఎం.లక్ష్మీ సురేఖ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, సెల్వ గణేశ్ చక్కటి మెలోడీ పాటలిచ్చారని, బేబి వేదిక కీలకపాత్ర పోషించిందని, త్వరలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: మహేశ్ అల్లు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement