మిస్ ఆచి మిసెస్ తూచి
ఆచితూచి తింటే ఆరోగ్యం బాగుండడమే కాకుండా...
మహిళలకు తమ బరువు మీద కంట్రోల్ వస్తుంది.
సన్నగా ఉండగలిగితే జీవితం చలాకీగా ఉంటుంది.
తొందరగా కీళ్ల నొప్పులు, ఆరోగ్యసమస్యలు సతాయించవు.
ఇంటి బడ్జెట్టును ఎంతో జాగ్రత్తగా చూసుకునే ఇల్లాలు...
తన ఒంటి బడ్జెట్టును ఎలా మేనేజ్ చేసుకోవాలో
తెలుసుకోకపోతే ఎలా?!
మిస్‌లు, మిసెస్‌లు క్యాలుక్యులేట్ చేసుకోడానికి
ఇక్కడో లెక్కుంది. దానికో కిక్కుంది.
పద్దులు మేమిచ్చాం. పాళ్లు మీరు సరిచూసుకోండి.
రెజీనా డైట్ ప్లాన్
మాణింగ్ గ్లాసుడు నీళ్లతో నా డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ లేక కాఫీ.
{బేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, దోసె.. ఇలా ఏదో ఒకటి తీసుకుంటా.
{బేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్య
{yై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు.
మధ్యాహ్న భోజనంలో
బీట్‌రూట్, క్యారెట్, కీరా ఉండేలా చూసుకుంటాను. కొంచెం రైస్, రోటీ తీసుకుంటా.
నాకు పనీర్ అంటే ఇష్టం.
నా శరీరానికి కావల్సిన ప్రొటీన్స్ పనీర్, పప్పుల ద్వారానే అందుతాయి.
ఆయిలీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. అందుకని వేపుళ్లను అవాయిడ్ చేస్తాను.
నూనె పదార్థాలకు దూరంగా ఉంటాను కాబట్టి, డైట్ పరంగా పెద్దగా నియామలు పాటించాల్సిన అవసరం లేకుండాపోతోంది.
లంచ్‌కి, డిన్నర్‌కి మధ్య ఫ్రూట్స్, నట్స్ తింటుంటాను.
డిన్నర్ లైట్‌గా తీసుకుంటాను.
రంజితకు ముప్పై ఏళ్లుంటాయి. ఇద్దరు పిల్లల తల్లి. గృహిణి. రోజంతా క్షణం తీరికలేని పని. రెండు పూటల హెవీ మీల్స్, సాయంకాలం స్నాక్స్, రాత్రి పడుకునే ముందు పాలు... ఇన్ని తీసుకుంటున్నా నీరసంగానే ఉంటోంది. పత్రికల్లో, టీవీల్లో వచ్చే ఆరోగ్యం సూత్రాలను చదువుతుంది, చూస్తుంది, వింటుంది. ఆ లెక్క ప్రకారమే దాదాపుగా తన డైట్‌ని ప్లాన్ చేసుకుంటున్నా తనకెందుకనో సూట్ అవడం లేదు. లోపం ఎక్కడుందో తెలియడం లేదు. అసలు తన శ్రమకు ఎలాంటి అహారం తీసుకోవాలో అర్థంకావడం లేదు.
అవంతిక వయసు నలభై. ఏజీ ఆఫీస్‌లో వర్క్ చేస్తుంది. తనదీ అదే సమస్య. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం రైస్‌తో లంచ్, రాత్రికి డిన్నర్‌లో చపాతి. ఈవినింగ్ స్నాక్స్‌లో స్ప్రౌట్స్ తీసుకుంటోంది. వినడానికి హెల్దీ డైట్‌లాగే ఉన్నా అవంతికకేమీ తేడా కనిపించడం లేదు. ఎనర్జిటిక్‌గా ఉన్నట్టు ఫీలవడం లేదు. ఉరుకుల పరుగుల తన లైఫ్ స్టయిల్‌కి ఈ డైట్ సూట్ అవుతుందో లేదో అర్థకావడం లేదు. రోజుకి ఎన్ని కేలరీలు తీసుకోవాలి? ఎన్ని కేలరీలు బర్న్ చేయాలో.. తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌ని వడపోస్తోంది.
వీళ్లిద్దరి సమస్య ఇలా ఉంటే టీనేజ్ గర్ల్ రశ్మి సమస్య వేరు. పద్దెనిమిదేళ్ల పిల్ల. ఇంజనీరింగ్ చదువుతోంది. మంచి హైట్. దానికి తగ్గ వెయిట్‌ను మెయిన్‌టైన్ చేయాలని తపన. ఉదయం పాలు.. మధ్యాహ్నం రెండు రోటీలు.. రాత్రి ఉడికించిన కూరగాయలతో కడుపునింపేసుకుంటుంది. దానికి తగ్గట్లే వర్కవుట్లు. సన్నగా తోటకూర కాడలా .. ప్రాణమంతా కళ్లల్లో నింపుకొని కనపడుతోంది. రశ్మిని చూసినప్పుడల్లా వాళ్లమ్మ మనసు తరుక్కుపోతోంది. ఇంటర్ వరకు ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉన్న పిల్ల ఒక్క యేడాదిలో వడలిపోయింది. పట్టుకుచ్చులా ఉండే జుట్టు గరికలా మారింది. పాలిపోయి కళావిహీనమైంది. ఈ డైట్ ఏంటో.. ఆ ఎక్సర్‌సెజైస్ ఏంటో ఆమెకు అంతుచిక్కడం లేదు.
వ్యత్యాసం..
నిజానికి ఈ ముగ్గురు స్త్రీల వయస్సు, చేస్తున్న పనుల తీరు వేరువేరు అయినా సమస్య ఒకటే. ఎన్ని కేలరీనిచ్చే ఆహారం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే! అయితే తీసుకునే ఆహారంలో మహిళలకు, పురుషులకు కొంత వ్యత్యాసం ఉంటుంది అన్న విషయం గమనించాలి. ఆ రకంగానే ఆహారాన్ని తీసుకోవాలి.
బాడీ మాస్ ఇండెక్స్
ముందుగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంటే శరీరంలో కండపాళ్లు సరిపడా ఉన్నాయా లేదా చూసుకోవడం. ఇదే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ). ఆరోగ్యంగా ఉన్న వాళ్ల బీఎమ్‌ఐ విలువ 19 నుంచి 23 మధ్య ఉంటుంది. 23 నుంచి 25 మధ్య ఉంటే ఉండాల్సిన దానికన్న బరువు ఎక్కువున్నట్టు లెక్క. 25 పై మాటే అంటే లావుగా ఉన్నట్టే అని నిర్ధారించుకోవాల్సిందే! 30 కంటే ఎక్కువుంటే అధిక బరువు అని అర్థం. ఈ బీఎమ్‌ఐ లెక్కించడానికి సులభమైన సూత్రమొకటి ఉంది. ఉదాహరణకు మీ ఎత్తు అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు అనుకుందాం.. అంటే 172 సెంటిమీటర్లన్న మాట. మీ బరువు 65 కిలోలు అనుకుందాం. అప్పుడు 65కిలోలు డివెడైడ్‌బై 1.72 ఇంటూ 1.72 కాలిక్యులేట్ చేస్తే మీ బీఎమ్‌ఐ వచ్చేస్తుంది.
ఎవరు.. ఎన్ని కేలరీలు.. తీసుకోవాలి?
బీఎమ్‌ఐ లెక్క చూసుకున్నాక ఆహారం విషయం ప్లాన్ చేసుకోవాలి. ఎవరి శారీరక శ్రమను అనుసరించి వాళ్లు డైట్‌చార్ట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ డైటరీ రిఫరెన్స్ ఒక పట్టికను తయారు చేసింది. దాని ప్రకారం.. బట్టలుతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు ఊడ్వడం, వంటచేయడం వంటి ఇంటి పని చేస్తున్న స్త్రీలు రెండువేల నుంచి రెండువేల రెండువందల కేలరీల ఆహారం తీసుకుంటూ ఉంటే వాళ్ల బరువు పెరగడంకానీ, తగ్గడం కానీ ఉండదు. ఒకే బరువు మెయిన్‌టైన్ అవుతూ ఉంటుంది. ఈ మోస్తరు పని ఉన్నవాళ్లే ఒక కిలో బరువు తగ్గాలి అనుకుంటే రోజుకి పన్నెండువందల కేలరీలు మాత్రమే తీసుకుంటే తొమ్మిది రోజుల్లో ఒక కిలో బరువు తగ్గుతారు. అంటే వీళ్లు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో వెయ్యి కేలరీలు తగ్గించాలన్నమాట. ఇలాకాకుండా వేగంగా బరువు తగ్గాలని అతి తక్కువ కేలరీలు తీసుకుంటుంటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ఎంత వేగంగా బరువు తగ్గుతారో అంతే వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు. కాబట్టి నిదానంగా బరువు తగ్గడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
మీరు రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ పట్టికను చూడండి.. పలు రకాల పదార్థాల్లోని క్యాలరీలు (సుమారుగా)...