ఆ ఫొటోషూట్ అందుకేనా! | Regina in Hunter Remake | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోషూట్ అందుకేనా!

Jul 26 2016 11:08 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఆ ఫొటోషూట్ అందుకేనా!

ఆ ఫొటోషూట్ అందుకేనా!

గతేడాది హిందీలో ‘హంటర్’ అనే సినిమా విడుదలైంది. ఆరు కోట్లతో తీసిన ఈ అడల్ట్ కామెడీ మూవీ పది రోజుల్లో 11 కోట్లు కలెక్ట్ చేసింది.

గతేడాది హిందీలో ‘హంటర్’ అనే సినిమా విడుదలైంది. ఆరు కోట్లతో తీసిన ఈ అడల్ట్ కామెడీ మూవీ పది రోజుల్లో 11 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో బోల్డ్ కంటెంట్ ఏ స్థాయిలో సేల్ అవుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగు వెర్షన్‌ని నిర్మిస్తోంది. దర్శక-నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా ఆసక్తి కనబరుస్తున్నారట.

 ఇప్పటివరకూ రెజీనా గ్లామరస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఇది వాటిని తలదన్నే పాత్రలా ఉంటుంది. వాస్తవానికి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో హోమ్లీ పాత్రల్లో కనిపించిన రాధికా ఆప్టే ‘హంటర్’లో బోల్డ్‌గా కనిపించడం చర్చనీయాంశమైంది. హాలీవుడ్ హీరోయిన్లను తలపించేలా బోల్డ్ సన్నివేశాల్లో బ్యూటిఫుల్‌గా నటించి, రాధిక అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను కూడా ఆ స్థాయిలో నటించాలనే పట్టుదలతో రెజీనా ఉన్నారని సమాచారం. అందుకే ఇటీవల ఆమె స్పెషల్ ఫొటోషూట్ చేయించుకున్నారని వినికిడి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో హాట్ హాట్‌గా కనిపిస్తున్నారు రెజీనా.
 
 ఆ ఫొటోలను చూసినవాళ్లు ‘హంటర్’ రీమేక్‌లోని పాత్రకు రెజీనా పూర్తి  న్యాయం చేయగలదని అంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హీరో చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు నుంచి అవసరాల శ్రీనివాస్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇందులో సెక్స్‌కి అడిక్ట్ అయిన క్యారెక్టర్‌లో నటిస్తున్న అవసరాల మాట్లాడుతూ - ‘‘అడల్ట్ కామెడీ సినిమా ఇది. హిందీ చిత్రంలానే తెలుగు రీమేక్ బోల్డ్‌గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అన్నారు. హిందీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో ఎన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో? అసలు రెజీనా నటిస్తారో? లేదో?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement