
తిరుపతిలో రెజీనా సందడి
సినీనటి రెజీనా శనివారం రాత్రి తిరుపతి లో సందడి చేశారు.
సినీనటి రెజీనా శనివారం రాత్రి తిరుపతి లో సందడి చేశారు. నీరూస్ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె రావడంతో అభిమానులు కేరింతలు కొడుతూ, ఈలలు, కేకలతో హోరెత్తించారు.
తిరుపతి సిటీ: తిరుపతిలోని ‘నీరూస్’ బ్రాండెడ్ షోరూంను టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా శనివారం ప్రారంభించారు. నగరంలోని ఏఐఆర్ బైపాస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన నీరూస్ ఇండియన్ ఎథినిక్ బ్రాండెడ్ షోరూంను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీనటి రెజీనాకు నీరూస్ మేనేజింగ్ డెరైక్టర్ హరీష్‌కుమార్, ప్రాంఛైజీ నిర్వాహకులు మాలిని, సుధాకర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షోరూంను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్కడి పలు వస్త్రాలు, శారీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం తాను మూడు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు.