నా డ్రీమ్ పాత్ర ఏమిటి? | What is the role of my dream | Sakshi
Sakshi News home page

నా డ్రీమ్ పాత్ర ఏమిటి?

Published Fri, Nov 11 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

నా డ్రీమ్ పాత్ర ఏమిటి?

నా డ్రీమ్ పాత్ర ఏమిటి?

నా డ్రీమ్ పాత్ర ఏమిటి? అనే ప్రశ్నను నాలో నేనే చాలా సార్లు వేసుకున్నాను అని పేర్కొన్నారు నటి రెజీనా. కోలీవుడ్‌లో కేడీబిల్లా కిలాడిరంగా చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ సక్సెస్‌ను అందించలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించి అక్కడ మంచి అవకాశాలతో సక్సెస్‌ఫుల్ నాయకిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత కో-2, వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రాల సక్సెస్‌తో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఈ అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం మానగరం, నెంజమ్ మరప్పదిల్‌లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

చిన్న గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెంజమ్ మరప్పదిల్‌లై. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న ఎస్‌జే. సూర్యకు జంటగా రెజీనా నటిస్తున్నారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నది గమనార్హం. స్థానిక ఈసీఆర్ రోడ్డులోని బంగ్లాలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో చాలా ఆసక్తే నెలకొంది. కారణం సెల్వరాఘవన్ హ్యాండిల్ చేస్తున్న తొలి హారర్ కథా చిత్రం కావడమే. అదే విధంగా చాలా గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రంలో నటించడంపై నటి రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చాలా కాలంగా తన డ్రీమ్ పాత్ర ఏదని తనలో తానే ప్రశ్నించుకునే దాన్నని, దానికి జవాబు ఆ చిత్రం ద్వారా లభించిందని పేర్కొన్నారు. ఇందులో మరిమయ్ అనే పాత్రలో నటిస్తున్నానన్నారు. తాను ఇంతకు ముందు ఈ తరహా పాత్రను పోషించలేదన్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు సెల్వరాఘవన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కాగా ఇందులో తనది పని మనిషి పాత్ర అని, కొందరి దురాగతానికి బలై దెయ్యంగా వచ్చి పగ తీర్చుకుంటారని రెజీనా వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement