రెజీనా ప్రేమలో పడిందా? | Regina love with telugu hero rumours | Sakshi
Sakshi News home page

రెజీనా ప్రేమలో పడిందా?

Published Fri, Dec 18 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

రెజీనా ప్రేమలో పడిందా?

రెజీనా ప్రేమలో పడిందా?

 ప్రేమ ఒక మోహం. యుక్త వయసులో దాని నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఇక సినీతారల విషయానికోస్తే చాలా మంది ప్రేమలో పలు మార్లు పడుతుంటారు. ఇందుకు నటి రెజీనా మినహాయింపు కాదు. ఈ  బ్యూటీ కోలీవుడ్‌లో కేడీబిల్లా కిలాడీ రంగా, రాజతందిరం చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు మంచి విజయాన్నే పొందాయి. అయినా రెజీనాకు ఇక్కడ అవకాశాలు రాలేదు. గ్లామర్ విషయంలో ఈ అమ్మడు మడి కట్టుకు కూర్చోవడమే అందుకు కారణం అనే వాళ్లు లేక పోలేదు.
 
  ఆ తరువాత అందాలారబొతకు గేట్లు ఎత్తివేసినట్లు స్టేట్‌మెంట్స్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో రెజీనా టాలీవుడ్‌లో మకాం పెట్టింది. అక్కడ కూడా మొదట్లో అన్నీ లంగా ఓణి పాత్రలే వస్తున్నాయని వాపోయినా తాజాగా అవకాశాలు బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్‌లో గ్లామర్ విషయంలో సరిహద్దులు దాటేస్తున్న రెజీనా ఇప్పుడు ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
 
 ఆ అమ్మడు ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ సాగరంలో తేలిపోతోందని,ఆయన ఈ అమ్మడికి చిత్రాలు సిఫార్సు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. రెజీనాకు ఇప్పటికే విక్రమ్ మీనన్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నారనీ, ఇటీవల కాస్త విరామం లభించడంతో అతనితో కలిసి అమ్మడు థాయ్‌ల్యాండ్ చుట్టొచ్చిందని వారు అంటున్నారు. ఇక నిజం ఏమిటన్నది ఆ పైవాడికే తెలియాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement