ఎప్పుడూ సినిమాలు, షూటింగులు, సెట్‌లో మేకప్ కిట్టులు... ఇవేనా? అనుకున్నట్టున్నారు రెజీనా! మేకప్ కిట్ ప్లేసులో కుకింగ్ సెట్ వచ్చింది. మొన్న ఆదివారం కిచెన్‌లోకి వెళ్లారు. చేపల్లో రెండు రకాలను ఇంటికి తెప్పించుకున్నారు. రెండిటినీ బాగా రోస్ట్ చేశారు. ఓ ప్లేటులో వాటిని అందంగా మేకప్ చేసి (అదేనండీ... గార్నిష్ చేసి) ఫొటో తీసుకున్నారు.
ఇన్‌సెట్‌లో చూస్తున్న ఫొటోలు అవే! కుకింగ్‌కి ముందు.. తర్వాత! ఆదివారం వంట చేశానని చెప్పారు గానీ... వంట రుచి ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. ఈసారి మీడియా ముందుకొచ్చినప్పుడు అడుగుదాంలెండి! అన్నట్టు... రెజీనా నటించిన తాజా తెలుగు సిన్మా ‘బాలకృష్ణుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో నారా రోహిత్ హీరో. వీళ్లిద్దరూ జంటగా నటించిన మూడో చిత్రమిది.
Comments
Please login to add a commentAdd a comment