ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...! | Regina to Romance Gopichand for Soukhyam | Sakshi
Sakshi News home page

ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...!

Nov 8 2015 11:27 PM | Updated on Sep 3 2017 12:14 PM

ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...!

ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...!

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండటం ప్రెజెంట్ ట్రెండ్...

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండటం ప్రెజెంట్ ట్రెండ్. కానీ, ఆ యువకుడు మాత్రం డిఫరెంట్. నలుగురి సౌఖ్యం కోరుకునే వ్యక్తి. ఆత్మీయుల పెదాలపై చిరునవ్వు చూడటానికి... ఎంటర్‌టైన్ చేయడానికైనా, యాక్షన్ చేయడానికైనా రెడీ అంటాడు. నలుగురి మంచి కోరుకునే వ్యక్తిగా గోపీచంద్, ఆయన సరసన  రెజీనా కథానాయికగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’.

ఆనందప్రసాద్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల స్విట్జర్లాండ్‌లో ‘ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...’, ‘నాకేం తోచదే నాకేం తోచదే...’, ‘ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ హని హని స్వీటీ స్వీటీ..’ అనే  మూడు పాటలను చిత్రీకరించాం. మిగతా రెండు పాటలను ఈ నెలాఖరులోపు చిత్రీకరిస్తాం. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.

‘‘ ‘యజ్ఞం’ తర్వాత మళ్లీ పదేళ్లకు గోపీచంద్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గోపీచంద్, రెజీనా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement