ట్రైన్‌లో పెళ్లి చూపులు! | Gopichand's Soukyam movie Audio releases on Dec 13 | Sakshi
Sakshi News home page

ట్రైన్‌లో పెళ్లి చూపులు!

Published Sat, Dec 5 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

ట్రైన్‌లో పెళ్లి చూపులు!

ట్రైన్‌లో పెళ్లి చూపులు!

‘‘నేను ఎవరితోనూ పెట్టుకోను. పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను’’ అని విలన్లను హెచ్చరిస్తాడతను. అదే మనిషి ప్రియురాలి దగ్గరకొచ్చేసరికి బోల్డంత చిలిపితనం కురిపిస్తాడు. ‘‘రైల్వే డిపార్ట్‌మెంట్ నాకో సూపర్ ఫిగర్‌తో పెళ్లి చూపులు ఎరేంజ్ చేసింది’’ అని ట్రైన్‌లో తన ఎదురుగా కూర్చున్న ప్రియురాల్ని ఉద్దేశించి చిలిపిగా అంటాడు. ‘సౌఖ్యం’ చిత్రంలో గోపీచంద్ పాత్ర ఎంత సీరియస్‌గా ఉంటుందో, అంతే చిలిపిగా ఉంటుందని అర్థం కావడానికి ఈ రెండు డైలాగ్స్ చాలు.

భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రెజీనా కథానాయిక. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 13న ఒంగోలులో భారీ ఎత్తున పాటల వేడుక చేయనున్నాం’’ అని చెప్పారు.

‘‘ఇటీవలే హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించాం. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోరాట ఘట్టాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్-గోపీమోహన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement