Soukyam
-
ఎన్నాళ్ళకు ఓ రూమర్!
రెజీనా మాతృభాష తమిళం అయినప్పటికీ, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ ఇక్కడి అమ్మాయిలా అయిపోయారు. తెలుగులో మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారామె. గోపీచంద్ సరసన రెజీనా నటించిన ‘సౌఖ్యం’ నేడు తెరకొస్తోంది. ఏ.యస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఇక... రెజీనా కసండ్రా ఏమంటున్నారో తెలుసుకుందాం. రవికుమార్ దర్శకత్వంలో నేను చేసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ నాది సీరియస్‌గా సాగే పాత్ర. మళ్లీ ఆయనతో చేసిన ఈ సినిమాలో నేను కామెడీ కూడా చేశాను. గోపీచంద్, రవికుమార్ చౌదరి, ఆనంద్‌ప్రసాద్ కాంబినేషన్ కాబట్టి, ఈ సినిమాకి అడగ్గానే ఒప్పేసుకున్నాను. భవ్య క్రియేషన్స్ యాక్టర్స్‌ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుతుంది. గోపీచంద్ చాలా మంచి వ్యక్తి. ఈ చిత్రం ద్వారా మరో సక్సెస్ అందుకుంటాననే నమ్మకం ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు నేనింత బిజీ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. షార్ట్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేసేటప్పుడు ‘ఎస్.ఎమ్.ఎస్’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఇక్కడ ఉండాలా? చదువు కంటిన్యూ చేయాలా? నిర్ణయించుకుందామనుకున్నా. కానీ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాను. నంబర్ గేమ్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. వాటి ని రీచ్ కావాలనేదే నా ప్రయత్నం. సాయిధరమ్‌తేజ్‌తో నాకు లవ్ ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. మూడేళ్ల బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. ‘నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి’ అని అడిగేవాళ్లు. ఎట్టకేలకు ఈ విధంగానైనా ఒక్క రూమర్ వచ్చింది. నేనేంటో నా ఫ్రెండ్స్‌కీ, ఫ్యామిలీ మెంబర్స్‌కీ తెలుసు. తెలుగులో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అందుకే నా మాతృభాష తమిళం అయినా అక్కడ చేయడం లేదు. అక్కడికి ఓ ఏడాది తర్వాత వెళ్లినా యాక్సెప్ట్ చేస్తారు. అయినా హడావిడిగా రెండు భాషల్లోనూ ఒకేసారి చేయలేను. నాకు సమయం దొరికితే సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటా. ప్రస్తుతం ‘టీచ్ ఫర్ ఛేంజ్’, ‘లైఫ్ ఈజ్ బాల్’, ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థలకి వర్క్ చేస్తున్నా. క్రిస్మస్ వేడుకలు ఈసారి థియేటర్లోనే. న్యూ ఇయర్ మాత్రం నా ఫ్రెండ్ పెళ్లిలో. అందుకు... చెన్నై వెళ్తున్నా. -
‘లౌక్యం’ను మించే సౌఖ్యం
‘‘రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్కొచ్చా. నేను ఏ రంగంలో అడుగుపెట్టినా అదృష్టాన్ని కాకుండా కృషినే నమ్ముకుంటాను. అందుకే ఈ స్థాయికి చేరుకున్నా’’ అని నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్ చెప్పారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ‘అమ్మాయే నవ్వితే, మనసుతో, శౌర్యం, అమరావతి, లౌక్యం’ తదితర చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా నిర్మించిన ‘సౌఖ్యం’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘గోపీచంద్ నాకిష్టమైన హీరో. ఓ రకంగా అతనికిది సొంత సంస్థ లాంటిది. రవికుమార్ చౌదరి మా సంస్థలోనే దర్శకుడయ్యాడు. వాళ్లిద్దరి కాంబినేషన్లో ‘యజ్ఞం’ తర్వాత వస్తున్న సినిమా ఇదే. ఇంతకు ముందు మేం గోపీచంద్‌తో తీసిన ‘లౌక్యం’ను మించి ఈ సినిమా హిట్టవుతుంది’’ అని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ - ‘‘త్వరలో ఓ పెద్ద హీరోతో సినిమా ఉంటుంది. అలాగే రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాం. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి ప్లానింగ్ మా సంస్థకు మెయిన్ ఎస్సెట్’’ అని చెప్పారు. -
ఒంగోలులో ‘సౌఖ్యం’ ఆడియో వేడుక
-
క్రిస్మస్కు చిన్న సినిమా పండుగ
జనవరిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలు కాస్త ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సాధారణంగా సంక్రాంతి సెలవులను టార్గెట్ చేసే తెలుగు ఇండస్ట్రీ వర్గాలు, ఈ సారి క్రిస్మస్ హాలీడేస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు క్రిస్మస్ సందర్భంగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. దాదాపు అన్ని సినిమాలు మంచి అంచనాలు ఉన్నవే కావటంతో ఈ పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. క్రిస్మస్ బరిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సౌఖ్యం. లౌఖ్యం, జిల్ సక్సెస్‌ల తరువాత గోపిచంద్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అల్లరి నరేష్, మోహన్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన మామ మంచు అల్లుడు కంచు కూడా రిలీజ్ అవుతోంది. చాలా రోజులుగా సరైన హిట్ లేని నరేష్ ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో క్రేజీ కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వీటితో పాటు సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం భలే మంచిరోజు, నాగశౌర్య హీరోగా తెరకెక్కిన అబ్బాయితో అమ్మాయి, రాజుగారి గది సినిమాతో హీరోగా పరిచయం అయిన అశ్విన్ ( ఓంకార్ తమ్ముడు) హీరోగా తెరకెక్కిన జతకలిసే... సినిమాలు కూడా ఇదే సీజన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురుకాకపోయినా, కలెక్షన్ల పరంగా మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. -
ట్రైన్లో పెళ్లి చూపులు!
‘‘నేను ఎవరితోనూ పెట్టుకోను. పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను’’ అని విలన్లను హెచ్చరిస్తాడతను. అదే మనిషి ప్రియురాలి దగ్గరకొచ్చేసరికి బోల్డంత చిలిపితనం కురిపిస్తాడు. ‘‘రైల్వే డిపార్ట్మెంట్ నాకో సూపర్ ఫిగర్‌తో పెళ్లి చూపులు ఎరేంజ్ చేసింది’’ అని ట్రైన్లో తన ఎదురుగా కూర్చున్న ప్రియురాల్ని ఉద్దేశించి చిలిపిగా అంటాడు. ‘సౌఖ్యం’ చిత్రంలో గోపీచంద్ పాత్ర ఎంత సీరియస్‌గా ఉంటుందో, అంతే చిలిపిగా ఉంటుందని అర్థం కావడానికి ఈ రెండు డైలాగ్స్ చాలు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రెజీనా కథానాయిక. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 13న ఒంగోలులో భారీ ఎత్తున పాటల వేడుక చేయనున్నాం’’ అని చెప్పారు. ‘‘ఇటీవలే హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించాం. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోరాట ఘట్టాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్-గోపీమోహన్. -
అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా
యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో రెజీనా ముందు వరుసలో నిలుస్తారు. ‘ఎస్.ఎమ్.ఎస్’తో మొదలైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటివరకూ ఎక్కడా బ్రేకుల్లేకుండానే సాగుతోంది. అయినా ఇంత వరకూ ఆమె ఊహించనంత మలుపు రాలేదు. అందుకే ఆమె ‘సౌఖ్యం’ సినిమా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే హీరోయిన్ల విషయంలో హీరో గోపీచంద్‌ది లక్కీహ్యాండ్ అనే చెప్పాలి. అతని సరసన నటించిన చాలా మంది హీరోయిన్లు టాప్ స్లాట్‌లోకి దూసుకె ళ్లారు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగ్. ‘లౌక్యం’లో గోపీచంద్‌తో రొమాన్స్ చేసిన రకుల్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. రకుల్‌కి ‘లౌక్యం’ లానే తనకు ‘సౌఖ్యం’ టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశాభావంలో ఉన్నారు రెజీనా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ‘సౌఖ్యం’ చిత్రానికి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. డిసెంబరు 13న ఒంగోలులో భారీ ఎత్తున పాటల వేడుక చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘సౌఖ్యం’ న్యూ స్టిల్స్