‘లౌక్యం’ను మించే సౌఖ్యం | Soukyam movie on december 24th | Sakshi
Sakshi News home page

‘లౌక్యం’ను మించే సౌఖ్యం

Published Fri, Dec 18 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

‘లౌక్యం’ను మించే సౌఖ్యం

‘లౌక్యం’ను మించే సౌఖ్యం

‘‘రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌కొచ్చా. నేను ఏ రంగంలో అడుగుపెట్టినా అదృష్టాన్ని కాకుండా కృషినే నమ్ముకుంటాను. అందుకే ఈ స్థాయికి చేరుకున్నా’’ అని నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్ చెప్పారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ‘అమ్మాయే నవ్వితే, మనసుతో, శౌర్యం, అమరావతి, లౌక్యం’ తదితర చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా నిర్మించిన ‘సౌఖ్యం’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆనంద్‌ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘గోపీచంద్ నాకిష్టమైన హీరో. ఓ రకంగా అతనికిది సొంత సంస్థ లాంటిది.

రవికుమార్ చౌదరి మా సంస్థలోనే దర్శకుడయ్యాడు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘యజ్ఞం’ తర్వాత వస్తున్న సినిమా ఇదే. ఇంతకు ముందు మేం గోపీచంద్‌తో తీసిన ‘లౌక్యం’ను మించి ఈ సినిమా హిట్టవుతుంది’’ అని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ - ‘‘త్వరలో ఓ పెద్ద హీరోతో సినిమా ఉంటుంది. అలాగే రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాం. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి ప్లానింగ్ మా సంస్థకు మెయిన్ ఎస్సెట్’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement