గ్యాంగ్..గ్యాంగ్..బజావో బ్యాంగ్... బ్యాంగ్ | Nithin enjoying with Regina, Sam & Rakul | Sakshi
Sakshi News home page

గ్యాంగ్..గ్యాంగ్..బజావో బ్యాంగ్... బ్యాంగ్

Published Tue, Jul 26 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

గ్యాంగ్..గ్యాంగ్..బజావో బ్యాంగ్... బ్యాంగ్

గ్యాంగ్..గ్యాంగ్..బజావో బ్యాంగ్... బ్యాంగ్

సమంత.. రకుల్.. రెజీనా.. నితిన్.. అండ్ టాలీవుడ్ టాప్ స్టైలిస్ట్ నీరజా కోన.. ఇప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారో తెలుసా? బ్రస్సెల్స్ సిటీలో. ఈ బ్యాచ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రస్సెల్స్ ఎక్కడుంది అంటారా? బెల్జియంలో. అక్కడికి ఎందుకు వెళ్లారు అనే డౌట్ వచ్చిందా? వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.. ‘టుమారోల్యాండ్’కి వెళ్లారు. ఫేమస్ డీజేల లైవ్ షో ఈ ఫెస్టివల్ ప్రత్యేకత.
 
  ‘గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్... స్టార్ట్ ది మ్యూజిక్’ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా అవార్డు వేడుకల్లోనో, పక్క పక్కనే షూటింగ్ జరుగుతున్నప్పుడో.. ఈ స్టార్స్ అందరికీ సరదాగా కలుసుకునే అవకాశం లభిస్తుంది. గ్యాంగ్ అంతా కలసి ట్రిప్ వేయడం అంటే గగనమే. ఒకవేళ ఎవరో ఒకరు ఖాళీగా ఉన్నప్పటికీ.. మిగతావాళ్లకి షూటింగ్ ఉంటే కష్టమవుతుంది. కానీ, ఈసారి అందరికీ కుదరడంతో బెల్జియం ట్రిప్ వేశారు.
 
 ‘‘చివరి క్షణంలో అనుకోకుండా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఈ నెల మొదటివారంలో ‘టుమారో ల్యాండ్’ టికెట్స్ తీసుకున్నాం’’ అని నీరజా కోన సాక్షితో చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘నేను, నితిన్, మరో ఇద్దరు స్నేహితులు కలసి ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మిలన్ (ఇటలీ) వెళ్లాం. సిటీ చూస్తూ.. షాపింగ్ చేస్తూ.. మిలన్‌లో సరదాగా గడిపాం. అక్కణ్ణుంచి 21న బ్రస్సెల్స్ చేరుకున్నాం.
 
  సమంత, రకుల్, రెజీనాలు బ్రస్సెల్స్‌లో మాతో జాయిన్ అయ్యారు. మా ఆయన అజయ్ అమెరికా నుంచి వచ్చారు. మ్యూజిక్.. మస్తీ.. మజా... దిస్ ట్రిప్ ఈజ్ ఫన్ విత్ మై హజ్బెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్’’ అని నీరజ పేర్కొన్నారు. ఎవరి మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేశారని ప్రశ్నిస్తే.. ‘‘ఫ్రెంచ్ డీజే డేవిడ్ గెట్టా, డచ్ డీజే ఆఫ్రోజాక్ మ్యూజిక్ మా ఫేవరెట్’’ అని చెప్పారు. ఈ నెల 28న వీళ్లంతా తిరుగు ప్రయాణమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement