అప్పుడు ఈగ... ఇప్పుడు చేప..! | Natural Star Nani Role in Awe | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 12:45 PM | Last Updated on Sat, Dec 23 2017 12:45 PM

Natural Star Nani Role in Awe - Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘అ!’ అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిత్యామీనన్. రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాని నిర్మాతగానే కాక మరో కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే ఆ పాత్ర కూడా తెర వెనుకకే పరిమితం కానుంది. ఈ సినిమాలో కనిపించే ఓ చేప పాత్రకు నాని డబ్బింగ్ చెపుతున్నాడు. తాజాగా ఆ చేప క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement