అవార్డు వస్తుందనే ఈ సినిమా చేశా! | Nara Rohit's Raja Cheyyi Vesthe Movie | Sakshi
Sakshi News home page

అవార్డు వస్తుందనే ఈ సినిమా చేశా!

Apr 23 2016 11:24 PM | Updated on Aug 29 2018 3:53 PM

అవార్డు వస్తుందనే ఈ సినిమా చేశా! - Sakshi

అవార్డు వస్తుందనే ఈ సినిమా చేశా!

విలన్‌గా ‘అమరావతి’ సినిమాలో భయపెట్టిన తారకరత్న తాజాగా ‘రాజా చెయ్యి వేస్తే’ ద్వారా మరో సారి ప్రతినాయకునిగా తెర మీదకు వస్తున్నారు.

 విలన్‌గా ‘అమరావతి’ సినిమాలో భయపెట్టిన తారకరత్న తాజాగా ‘రాజా చెయ్యి వేస్తే’ ద్వారా మరో సారి ప్రతినాయకునిగా తెర మీదకు వస్తున్నారు. నారా రోహిత్ హీరోగా  ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో సాయికొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. తారకరత్న  మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా చేస్తే కచ్చితంగా అవార్డు వస్తుందన్నారు.
 
 అందుకే చేశాను. కెరీర్ ప్రారంభంలో ఫాస్ట్‌గా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు జాగ్రత్తపడుతున్నా. ఎన్టీఆర్, నేను, కల్యాణ్‌రామ్ ఏదైనా సందర్భం వచ్చిన ప్పుడు కచ్చితంగా కలుస్తుంటాం. బయట కలసి కనిపించకపోతే మా మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నాయనుకోవడం కరెక్ట్ కాదు’’అని చెప్పారు. బాలకృష్ణ వందో సినిమాలో తారకరత్న నటిస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ‘‘అది నిజం కాదు. అయితే ఆయన సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేయడానికైనా రెడీ’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement