పొలిటికల్‌ థ్రిల్లర్‌  | 25th Jan 2024 Representative 2 Movie Released | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ థ్రిల్లర్‌ 

Published Tue, Jul 25 2023 12:48 AM | Last Updated on Tue, Jul 25 2023 12:48 AM

25th Jan 2024  Representative 2 Movie Released - Sakshi

కొంత గ్యాప్‌ తర్వాత నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘ప్రతినిధి 2’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసి, 2024 జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. ‘‘నారా రోహిత్‌ నటించిన ‘ప్రతినిధి’ ఫ్రాంచైజీలో భాగంగా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ‘ప్రతినిధి 2’ని రూపొందిస్తున్నాం. సామాజిక సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement