
నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఈ నెల 11న ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ మీ ముందుకు రాబోతోంది అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ఇంతవరకు బయటకు రాలేదు. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్‌లో ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఉన్న చిత్రయూనిట్.. ఈ నెల 11న ఏం ప్రకటించనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాబా క్రియేషన్స్‌పై అప్పారావు బెల్లన నిర్మించగా, ఇంద్రసేనా దర్శకత్వం వహిస్తున్నారు.