
కెరీర్ లో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీయి ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప‍్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న యూనిట్ సభ్యులు మరింత హైప్ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు.
అందుకే ఈ సినిమాకు ఓ యంగ్ హీరోతో వాయిస్ ఓవర్ చేయిస్తున్నారు ఒక్కడు మిగిలాడు టీం. ఇప్పటికే వరుస మల్టీ స్టారర్‌లతో అలరిస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ ఒక్కడు మిగిలాడు సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. సినిమా టైటిల్స్ పడే సమయంలో రోహిత్ వాయిస్ వినిపించనుంది. మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
Terrific voice for the titles of #OkkaduMigiladu by my friend/cousin #NaraRohith ❤❤Love you! Thank you for adding up the intensity! ☺ pic.twitter.com/crUT0e1e0r
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 7 November 2017
Comments
Please login to add a commentAdd a comment