
తెలుగు హీరో నారా రోహిత్ పెళ్లికి సిద్ధమయ్యాడు

హైదరాబాద్‌లో ఆదివారం గ్రాండ్‌గా నిశ్చితార్థం జరగనుంది

'ప్రతినిధి 2'లో కలిసి నటించిన సిరి లెల్లా అనే అమ్మాయితో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాడు

ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని చాలామంది డౌట్

సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ చదువుకుంది

ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ చేసి హీరోయిన్ అవ్వాలనే కోరికతో తిరిగి స్వదేశానికి వచ్చేసింది

'ప్రతినిధి 2' మూవీ ఆడిషన్స్‌కి వెళ్లగా.. లక్కీగా ఈమె హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది

మాస్టర్స్ పూర్తయ్యాక ఇంట్లో పెళ్లి గురించి తల్లిదండ్రులు ఈమెని అడిగారట

రెండేళ్లు ఆగండి అని చెప్పి, పేరెంట్స్‌కి ఇష్టం లేకపోయినా సరే సినిమాల్లోకి వచ్చింది

'ప్రతినిధి 2' రిలీజై ఆరు నెలలైనా గడవక ముందే పెళ్లికి సిద్ధమైపోయింది

నారా రోహిత్ ప్రేమ విషయం చెప్పడంతో పెద్దమ్మ భువనేశ్వరి.. అమ్మాయి తరఫు వాళ్లతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట

అలా ఇప్పుడు రోహిత్-సిరి నిశ్చితార్థం చేసుకుంటున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారు

ఇక ఈమె సోషల్ మీడియాలో ఉన్న ఫొటోలు చూస్తే అటు క్లాస్, ఇటు మోడ్రన్ డ్రస్సులో చూడచక్కగా ఉంది

