
వెంకటేశ్, నారా రోహిత్
విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా తీసుకొని తమిళంలో దర్శకద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లు కూడా సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్‌గా ఈ రీమేక్‌లో వెంకటేశ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తారని సమాచారం. వీవీ వినాయక్ దర్శకుడు అని తెలిసింది. మాధవన్ చేసిన పాత్రను నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్‌లో వెంకటేశ్ కనిపిస్తారని సమాచారం. గతంలో వెంకటేశ్ – వీవీవినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment