ఆటగాళ్లుగా.. రోహిత్, జగ్గుభాయ్ | paruchuri Murali Multi Starrer with Nara Rohith, Jagapati Babu | Sakshi
Sakshi News home page

ఆటగాళ్లుగా.. రోహిత్, జగ్గుభాయ్

Published Wed, Oct 11 2017 12:25 PM | Last Updated on Wed, Oct 11 2017 1:36 PM

Aatagallu New

ఇప్పటికే పలువురు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించిన నారా రోహిత్, ఇప్పుడు ఓ సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. విభిన్న పాత్రలతో అలరిస్తున్న స్టార్ జగపతిబాబుతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెట్టిన రోహిత్ మరోసారి మాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు.

పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆటగాళ్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నారా రోహిత్, జగపతి బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement