
నందమూరి తారకరత్న, మేఘ శ్రీ జంటగా చాందిని క్రియేషన్స్ పతాకంపై శివప్రభు దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘అమృత వర్షిణి’. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి హీరోలు నారా రోహిత్, శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాను థ్రిల్లర్, లవ్, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. చిక్‌మంగళూరులో జరగనున్న సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతున్న ఈసినిమాకు జెస్సీ గిఫ్ట్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment