జెంటిల్‌మన్ బ్యూటీతో రోహిత్ | Nivetha Thomas In Nara Rohith Shabdham | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 28 2018 3:26 PM | Last Updated on Wed, Mar 28 2018 3:26 PM

Nivetha Thomas In Nara Rohith Shabdham - Sakshi

జెంటిల్‌మన్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి నివేదా థామస్‌. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటుంది. జెంటిల్‌మన్‌ తరువాత నిన్నుకోరి, జై లవ కుశ సినిమాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోతో సినిమా చేసిన తరువాత మరో సినిమా అంగీకరించేందుకు చాలా సమయం తీసుకుంది.

తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కుతన్న ‘శబ్దం’ సినిమాలో నివేదాను హీరోయిన్ గా ఫైనల్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడిగా నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement