విడుదల రోజు మళ్లీ చూస్తా – సుకుమార్‌ | veera bhoga vasantha rayalu teaser release | Sakshi
Sakshi News home page

విడుదల రోజు మళ్లీ చూస్తా – సుకుమార్‌

Published Wed, Oct 17 2018 12:26 AM | Last Updated on Wed, Oct 17 2018 12:26 AM

veera bhoga vasantha rayalu teaser release - Sakshi

‘‘ఒక కొత్త ఆలోచనతో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఈ చిత్రం కథే’’ అని దర్శకుడు సుకుమార్‌ అన్నారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్‌ బాబు, శ్రియ ముఖ్య తారలుగా ఆర్‌. ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. బెల్లన అప్పారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరడానికి ఓ సారి ఇంద్ర వచ్చినప్పుడు కుదరదని చెప్పాను.

ఆ తర్వాత ఓ సందర్భంలో ఈ సినిమా ఆలోచన గురించి చెప్పాడు. ఇటీవల ఈ సినిమా చుశా. చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ట్రెండీగానూ ఉంది. ఐడియా పరంగా ఇంద్రకు నేను పోటీ కాదని ఈ సినిమా చూశాక అర్థం చేసుకున్నాను. సినిమా విడుదల రోజు మళ్లీ చూస్తా’’ అన్నారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. నేను మాట్లాడటం కంటే విడుదలయ్యాక ఈ సినిమానే ఎక్కువగా మాట్లాడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఇంద్ర చాలా కష్టపడ్డారు. చిరంజీవి ఇంద్ర కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ఈ కార్యక్రమంలో శ్రియ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement