2013 వింబుల్డన్‌లో స్విస్ స్టార్, నాటి ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ సెర్గీ స్టాకోస్కీ.. ప్రస్తుతం దేశ రక్షణలో భాగంగా రష్యా సేనలతో తలపడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆకర్షణగా మారాడు. కొన్ని వారాల క్రితమే టెన్నిస్ రాకెట్‌ను(రిటైర్మెంట్) వదిలి గన్ చేత పట్టిన 36 ఏళ్ల సెర్గీ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో దేశం కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పుడు రాకెట్ పట్టుకుని ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు.. ప్రస్తుతం చేతిలో గన్ పట్టుకుని పుట్టిన గడ్డ కోసం పోరాడుతున్నాడు.
సెర్గీ చేతిలో గన్ పట్టుకుని కీవ్ వీధుల్లో తిరుగుతున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సెర్గీ.. దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉన్నప్పటికీ, పురిటి గడ్డ కోసం వీరుడిలా పోరాడుతున్నాడనంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో విహారయాత్రలో ఉన్న సెర్గీ.. విషయం తెలుసుకుని, తన కుటుంబాన్ని సురక్షిత ప్రదేశంలో ఉంచి, తాను రణరంగంలోకి ప్రవేశించాడు.
చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నేచురల్ స్టార్ నాని
Comments
Please login to add a commentAdd a comment