టెన్నిస్‌లో టాప్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా ఘనత
పారిస్: ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్‌లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు.
టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్‌కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు.
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment