World No. 1 Ranking
-
సినెర్... కొత్త నంబర్‌వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
చరిత్ర సృష్టించిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్
ట్యురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్ కొత్త చరిత్ర లిఖించాడు. 1973లో అధికారికంగా ర్యాంకింగ్స్ మొదలయ్యాక నంబర్‌వన్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించనున్న పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా; 2001లో 20 ఏళ్ల 214 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును అల్కరాజ్ తిరగరాశాడు. గాయం కారణంగా అల్కరాజ్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తే స్పెయిన్ దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించేవాడు. కానీ నాదల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న అల్కరాజ్ (6,820 పాయింట్లు) డిసెంబర్ 5న ముగిసే టెన్నిస్ సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించడం ఖరారైంది. ఈ ఏడాదిని 32వ ర్యాంక్‌తో ప్రారంభించిన అతను సెప్టెంబర్ 12న నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఎదిగాడు. పిన్న వయస్కులో టాప్ ర్యాంక్ అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సంవత్సరం అల్కరాజ్ ఐదు సింగిల్స్ టైటిల్స్ (రియోఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ మాస్టర్స్, యూఎస్ ఓపెన్) సాధించాడు. మొత్తం 57 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 76 లక్షల 27 వేల 613 డాలర్ల (రూ. 62 కోట్లు) ప్రైజ్‌మనీ సంపాదించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న 18వ ప్లేయర్ అల్కరాజ్. 2003 తర్వాత బిగ్–4 ప్లేయర్లు (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) కాకుండా మరో ప్లేయర్ టాప్ ర్యాంక్‌తో ముగించడం ఇదే ప్రథమం. నాదల్ తర్వాత స్పెయిన్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. -
వరల్డ్ నంబర్‌వన్‌గా మెద్వెదెవ్
దుబాయ్: రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ టెన్నిస్ ప్రపంచంలో శిఖర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదెవ్కు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ దక్కుతుంది. కెరీర్లో ఒకే ఒక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్... కఫెల్నికోవ్, మారత్ సఫిన్ తర్వాత అగ్ర స్థానానికి చేరిన మూడో రష్యా ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్‌లో కనీసం సెమీ ఫైనల్ చేరితే నంబర్‌వన్ ర్యాంక్ నిలబెట్టుకోగలిగే స్థితిలో బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్యంగా 4–6, 6–7 (4/7) తేడాతో వరల్డ్ నంబర్ 123 జిరి వెస్లీ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలై అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫిబ్రవరి 2020నుంచి జొకోవిచ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ముర్రేని మినహాయించి గత 18 ఏళ్లలో (2004నుంచి) వరల్డ్ నంబర్ స్థానానికి చేరిన తొలి ఆటగాడు కావడం విశేషం. -
జొకోవిచ్ ‘టాప్’ రికార్డు
లండన్: పురుషుల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా ప్రస్తుత టాప్ ర్యాంకర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ 12, 030 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను నిలబెట్టు కున్నాడు. 311 వారాలపాటు ఈ స్థానం లో నిలవడం ద్వారా 310 వారాలతో ఇప్పటివరకు ఫెడరర్ (స్విట్జర్లాండ్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. -
ఎన్నో త్యాగాల ఫలితమిది
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై సానియా వ్యాఖ్య ఏటికి ఎదురీది ఈ స్థాయికి వచ్చాను గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకం ‘ఫ్రెంచ్’ టైటిల్‌పై గురి చార్ల్స్టన్ (అమెరికా): చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా... ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ... తనతోపాటు కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాల ఫలితమే ‘ప్రపంచ నంబర్‌వన్’ ర్యాంక్ అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గతవారం మూడో ర్యాంక్‌లో ఉన్న సానియా తాజాగా 7,660 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా... నంబర్‌వన్‌గా ఉన్న సారా ఎరాని (ఇటలీ) 7,640 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో టైటిల్ నెగ్గిన తర్వాత సానియా మీర్జా పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.... హింగిస్ తోడ్పాటు అద్భుతం: నా కెరీర్లో గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడే సమయానికి నేను నంబర్‌వన్ ర్యాంక్‌కు 2,500 పాయింట్ల దూరంలో ఉన్నాను. అయితే మూడు టోర్నమెంట్లు ఆడాక నంబర్‌వన్ ర్యాంక్ దక్కడంతో నా ఆనందం రెట్టింపైంది. నా కల నిజం కావడంలో మార్టినా హింగిస్ సహకారం మరువలేను. ఈ మూడు టోర్నమెంట్ల సందర్భంగా కొన్ని కీలకదశల్లో ఆమె తోడ్పాటుతో గట్టెక్కాను. ఆమె గొప్ప చాంపియన్. ఈ ఘనత చిరకాలం: ప్రతికూలతలను అధిగమించి... నేను, నా కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాలకు నేడు తగిన గుర్తింపు లభించింది. ఈ ఘనతను నా నుంచి ఎవరూ తీసుకోలేరు. 50 ఏళ్ల తర్వాత కూడా నన్ను మాజీ నంబర్‌వన్ ప్లేయర్‌గానే గుర్తిస్తారు. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి నంబర్‌వన్ ర్యాంక్ సాధించాను. నా వంతుగా దేశానికి పేరు తెచ్చాను. ఏటికి ఎదురీదాను: ప్రస్తుతం నేను నా స్వీయచరిత్రను రాస్తున్నాను. దాని టైటిల్ పేరు ‘అగేనెస్ట్ ఆల్ ఆడ్స్’. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఆరేళ్ల వయస్సులో నేను రాకెట్ పట్టే సమయానికి ప్రత్యేకంగా క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు లాంటివి లేవు. చెప్పుకుంటే వింతగా అనిపిస్తుంది కానీ ఆవు పేడతో తయారుచేసిన కోర్టుపై సాధన చేశాను. అలాంటి పరిస్థితుల నడుమ రాకెట్ చేతపట్టి ప్రపంచంలో అత్యున్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగడమంటే ఏటికి ఎదురీదాననే అనుకుంటున్నాను. ఏదైనా సాధ్యమే: పట్టుదల, గట్టి సంకల్పం ఉంటే సకల సౌకర్యాలు లేకపోయినా టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమే. ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళల విభాగానికి నేను గుడ్‌విల్ అంబాసిడర్‌ను. ప్రతి మహిళ, అమ్మాయి తమని తాము ఓ శక్తిగా భావించాలే తప్ప బలహీనత అని అనుకోకూడదు. గట్టి సంకల్పంతో ముందుకు సాగుతూ త్యాగాలు చేస్తూ శ్రమిస్తే ఎలాంటి నేపథ్యం ఉన్న వాళ్లయినా అద్భుతాలు చేయగలరు. మరిన్ని విజయాలపై దృష్టి: మార్టినా హింగిస్‌తో భాగస్వామ్యం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఆమెతో కలిసి వరుసగా మూడు టోర్నమెంట్లలో టైటిల్స్ గెలవడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మిక్స్డ్ డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినప్పటికీ మహిళల డబుల్స్ విభాగంలో నా ఖాతాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేదు. వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ కొరత తీర్చుకునేందుకు తీవ్రంగా సాధన చేస్తాను.