దుబాయ్: రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ టెన్నిస్ ప్రపంచంలో శిఖర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదెవ్‌కు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ దక్కుతుంది. కెరీర్‌లో ఒకే ఒక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్... కఫెల్నికోవ్, మారత్ సఫిన్ తర్వాత అగ్ర స్థానానికి చేరిన మూడో రష్యా ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్‌లో కనీసం సెమీ ఫైనల్ చేరితే నంబర్‌వన్ ర్యాంక్ నిలబెట్టుకోగలిగే స్థితిలో బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్యంగా 4–6, 6–7 (4/7) తేడాతో వరల్డ్ నంబర్ 123 జిరి వెస్లీ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలై అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫిబ్రవరి 2020నుంచి జొకోవిచ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ముర్రేని మినహాయించి గత 18 ఏళ్లలో (2004నుంచి) వరల్డ్ నంబర్ స్థానానికి చేరిన తొలి ఆటగాడు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment