
పారిస్: పురుషుల టెన్నిస్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వరుసగా 800 వారాలపాటు టాప్–10లో నిలిచిన తొలి ప్లేయర్‌గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 9,850 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న నాదల్... 800 వారాల పాటు (15 ఏళ్లకు పైగా) టాప్–10లో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా ఘనత వహించాడు. గతంలో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన రికార్డు జిమ్మీ కానర్స్ (789 వరుస వారాలు) పేరిట ఉండేది. 2005 ఏప్రిల్‌లో తొలిసారిగా టాప్–10లో ప్రవేశించిన 34 ఏళ్ల నాదల్... గతేడాది నవంబర్‌లోనే జిమ్మీ కానర్స్‌ను వెనక్కి నెట్టేశాడు. వరుస వారాల పరంగా కాకుండా ఓవరాల్‌గా చూస్తే... అత్యధికంగా 931 వారాల పాటు స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ టాప్–10లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment