మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్‌లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్‌లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 473వ ర్యాంక్‌కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment