life ban
-
135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 473వ ర్యాంక్‌కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది. చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
41 సొంత గోల్స్.. ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం
41 సొంత గోల్స్ కొట్టి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం పడింది. ఆ క్లబ్లో ఉన్న నాలుగు టీమ్‌లకు ఈ నిషేధం వర్తించనుంది. వాస్తవానికి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పొరపాటున సొంత గోల్ చేయడం సహజమే. ఒక్కోసారి ఫన్నీగానూ ఇలాంటి సొంత గోల్స్ నమోదవుతాయి. ఒకటి.. రెండు అంటే పర్వాలేదు గానీ.. అదే పనిగా సొంత గోల్‌పోస్ట్‌పై దాడి చేయడం మ్యాచ్ ఫిక్సింగ్ కిందకు వస్తుంది. దీంతో ఆయా జట్టుపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా సౌతాఫ్రికా ఫుట్‌బాల్ క్లబ్ సామీ మైటీబర్డ్స్ విషయంలో అదే జరిగింది. మతియాసితో జరిగిన మ్యాచ్‌లో సామీ మైటీబర్డ్స్ 59-1 రికార్డు గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఇందులో 41 గోల్స్ సామీ మైటీబర్డ్స్ సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం సెల్ఫ్ గోల్ చేసే అది ప్రత్యర్థి ఖాతాలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో సామీ మైటీబర్డ్స్ జట్టులో ప్లేయర్ నెం-2 10 గోల్స్, ప్లేయర్ నెంబర్-5 20 గోల్స్, మరొక ప్లేయర్ 11 గోల్స్.. సెల్ఫ్ గోల్స్ కొట్టినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించాడు. దీంతో ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో సౌతాఫ్రికా లోయర్ డివిజన్లోని నాలుగు క్లబ్స్పై జీవితకాలం నిషేధం పడింది. South African lower division side Matiyasi FC 🇿🇦 have been BANNED for life after beating Nsami Mighty Birds 59-1, with 41 of the goals scored as own-goals. Matiyasi were vying for promotion to the Provincial ABC Motsepe League. pic.twitter.com/6D59M0dmy0 — Nuhu Adams ™️ (@NuhuAdams_) June 1, 2022 చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్ -
చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
క్రికెట్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి అవి కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. అయితే ఇలాంటివి జరగకుండా అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగిస్తుంటారు. మరి అలాంటి అంపైర్లకు చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తే ఆటగాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా అలాంటి పనే పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ చేసింది. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అంపైర్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తానంటూ తిమోటి వీర్ అనే క్లబ్ క్రికెటర్ గ్రౌండ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 4న గిస్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరిపిన పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ తిమోటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్‌పై దురుసు ప్రవర్తన మాత్రమేగాక చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవెల్-4 నిబంధనలను తిమోటి అతిక్రమించినట్లు తేలింది. ఈ చర్యలకుగాను ఇకపై క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా తిమోటి ఇదే తరహాలో తన దురుసు ప్రవర్తనతో కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని.. అందుకే తాజా చర్యను సీరియస్‌గా తీసుకొని జీవితకాలం నిషేధం విధించినట్లు పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ ఐసాక్ హ్యూగ్స్ వివరణ ఇచ్చారు. చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్ -
శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శంతకుమరన్ శ్రీశాంత్‌కు ఊరట. ఈ కేరళ క్రికెటర్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది. తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
శ్రీశాంత్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గత కొన్నేళ్లుగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఆశోక భూషణ్-జస్టిస్ కేఎమ్ జోసెఫ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుబట్టింది. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం నిర్ణయాన్ని మూడు నెలల్లో పునః సమీక్షించుకోవాలని పేర్కొంది. ఈ రోజు విచారణ సందర్భంగా శ్రీశాంత్‌పై నిషేధం అనేది చట్ట పరంగానే జరిగిందంటూ బీసీసీఐ వాదించింది. అయితే శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ మాత్రం తన వాదనను బలంగా వినిపించారు. కేవలం మ్యాచ్ ఫిక్సర్లు శ్రీశాంత్‌ను కలిసిన విషయాన్ని బోర్డుకు చెప్పని కారణంగా అతనిపై జీవిత కాల నిషేధం విధించడం తగదంటూ వాదించారు.ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం సరైనది కాదని, దాన్ని పునరాలోచించుకోవాలంటూ బీసీసీఐకి స్పష్టం చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కేరళ సింగిల్ బెంచ్ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
నిషేధం తొలగించండి
కొచ్చి: బీసీసీఐచే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న పేసర్ శ్రీశాంత్ తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఇటీవలే స్కాట్లాండ్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు బోర్డు అతడికి ఎన్వోసీ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఇప్పటికే నాలుగేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రస్తుత పరిపాలక కమిటీని పర్యవేక్షిస్తున్న వినోద్ రాయ్‌కు శ్రీశాంత్ లేఖ రాశాడు. 2013లో జరిగిన ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయినా ఢిల్లీ పోలీసులచే క్లీన్చిట్ పొందానని, అయినా గత బోర్డు పెద్దలు ఇంకా తనపై కక్ష సాధిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందాడు. దీంతో గతంలో చాలాకాలం కేరళలో ఐఏఎస్‌గా పనిచేసిన వినోద్ రాయ్ జోక్యం కోసం శ్రీశాంత్ ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడా విఫలమైతే తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా కోర్టుకెక్కే ఆలోచనలో ఉన్నాడు. -
'కోచ్ రేసులో నేనున్నాను'
కరాచీ: మేజర్ టోర్నమెంట్లు జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ క్రికెట్ కోచ్ ఆందోళనకు గురవుతుంటాడు. ఎందుకంటే ప్రత్యర్థిగా భారత్ ఎదురవడం, దాయాది చేతిలో ఓటమి చవిచూడటం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచకప్ లాంటి మేజర్ ఈవెంట్లలో భారత్ పై నెగ్గిన చరిత్ర ఆ జట్టుకు లేదు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ చేతిలో ఓటమి తర్వాత ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో కోచ్ పదవికి తానే స్వయంగా రాజీనామా చేస్తున్నట్లు వకార్ యూనిస్ ప్రకటించాడు. బోర్డుకు రాజీనామా లేఖను అందించాడు. అప్పటినుంచీ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. 53 టెస్టులు, 283 వన్డే మ్యాచ్ లు ఆడిన పాక్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కోచ్ రేసులో తాను ఉన్నట్లు పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ వెల్లడించాడు. పాక్ జట్టుకు కోచ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ పదవికి ఆప్లై చేస్తానని చెప్పాడు. అయితే సలీం మాలిక్ పై పాక్ బోర్డు విధించిన నిషేధం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 2000లోనే అతడిపై వేటు పడిన విషయం తెలిసిందే. పాక్ జట్టు ఇటీవలే ఇంజమామ్ ను జాతీయ సెలెక్టర్ గా నియమించింది. కోచ్ పదవికి విదేశీయుల పేర్లను పరిశీలించడం కూడా పాక్ క్రికెట్ బోర్డు మొదలుపెట్టింది. విదేశీ కోచ్ ను తీసుకురావడం అనేది వృథా ప్రయత్నమని పేర్కొన్నాడు. జస్టిస్ మాలిక్ ఖయ్యూం కమిషన్ తనపై నిషేధం విదించాలని గతంలో నిర్ణయించిన మాట వాస్తవమేనని, అయితే ఎప్పటివరకు తాను క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వస్తుందో తెలియదన్నాడు. ఆ వివరాలపై స్పష్టతలేదంటూనే.. ఏ ఫార్మాట్లోనూ తాను క్రికెట్ ఆడలేదని అందుకే జాతీయజట్టుకు సేవలు అందించాలని భావిస్తున్నట్లు వివరించాడు. -
ఫిక్సింగ్ చేశా.. అందుకు సిగ్గుపడుతున్నా
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన న్యూజిలాండ్ క్రికెటర్ లూ విన్సెంట్‌పై వేటుపడింది. నేరం చేసినట్టు అంగీకరించడంతో చాంపియన్స్ లీగ్ టి-20 గవర్నరింగ్ కౌన్సిల్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విన్సెంట్‌పై జీవితకాల నిషేధం విధించాయి. అంతర్జాతయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయాన్ని సమర్థించింది. 'నా పేరు లూ విన్సెంట్. నేను మోసం చేశా. క్రీడాకారుడిగా నా స్థాయిని దిగజార్చుకున్నాను. చాలాసార్లు డబ్బులు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడ్డాను. దేశానికి, క్రీడకు మచ్చతెచ్చాను. తప్పు చేసినందుకు సిగ్గుపడుతున్నా. చాలా ఏళ్లుగా ఈ చేదు రహస్యం నాలో దాచుకున్నా. నిజం చెప్పాలని నిర్ణయించుకున్నా' అని విన్సెంట్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అతనిపై వేటు వేశారు. 2008లో జరిగిన ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలో విన్సెంట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. నిషేధానికి గురైన ఇండియన్ క్రికెట్ లీగ్‌లోనూ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అతను అంగీకరించాడు. విన్సెంట్‌పై వేటువేయడాన్ని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ స్వాగతించారు. ఈ కఠిన చర్య ఇతర ఆటగాళ్లకు ఓ హెచ్చరికలాంటిదని చెప్పారు. తప్పు చేస్తే కెరీర్, జీవితం ఎలా నాశనమవుతాయో ఇతర క్రికెటర్లు గుర్తించాలని హెచ్చరించారు. -
గుత్తా జ్వాలపై వేటుకు సిఫారసు
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలపై వేటు వేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాదీపై జీవితకాల నిషేధం విధించాలని బాయ్ క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా ఓ మ్యాచ్‌లో జ్వాల తన జట్టు క్రిష్ ఢిల్లీ స్మాషర్స్‌కు చెందిన కొందరు షట్లర్లు ఆడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిందని నిర్ధారించింది. ఆమెపై జీవతకాల నిషేధం లేదా కొంతకాలం పాటు సస్పెన్షన్ విధించాలని క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసినట్టు బాయ్ వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సిఉందని వెల్లడించారు. ఐబీఎల్‌లో బంగా బీట్స్‌తో మ్యాచ్ సందర్భంగా జ్వాల వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో బాయ్ విచారణకు ఆదేశించింది. కాగా బాయ్, జ్వాల మధ్య వివాదం చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ జ్వాల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ఐబీఎల్ నిర్వాహకులపైనా వేలం విషయంలో విరుచుకుపడింది. -
లలిత్ మోడీపై జీవితకాల నిషేధం
-
లలిత్ మోడీపై జీవితకాల నిషేధం
ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోడీపై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. బుధవారమిక్కడ జరిగిన బోర్డు ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డానే ఆరోపణలు రావడంతో ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి మోడీని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారించిన బీసీసీఐ క్రమిశిక్షణ సంఘం మోడీపై వేటు వేయాలని ఇటీవల బోర్డుకు నివేదించింది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రత్యేకంగా సమావేశమై మోడీపై కఠిన చర్యలు తీసుకుంది. కాగా అంతకుముందు బోర్డు సమావేశాన్ని అడ్డుకునేందుకు మోడీ చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మోడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. లలిత్ మోడీ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నాడు.