లలిత్ మోడీపై జీవితకాల నిషేధం | Life ban on former IPL commissioner Lalit modi | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 25 2013 3:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోడీపై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. బుధవారమిక్కడ జరిగిన బోర్డు ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డానే ఆరోపణలు రావడంతో ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి మోడీని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారించిన బీసీసీఐ క్రమిశిక్షణ సంఘం మోడీపై వేటు వేయాలని ఇటీవల బోర్డుకు నివేదించింది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రత్యేకంగా సమావేశమై మోడీపై కఠిన చర్యలు తీసుకుంది. కాగా అంతకుముందు బోర్డు సమావేశాన్ని అడ్డుకునేందుకు మోడీ చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మోడీ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. లలిత్ మోడీ ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement