డోపింగ్ వివాదంపై టెన్నిస్ స్టార్ల ఆగ్రహం
వాషింగ్టన్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ)ని పెద్ద వివాదం చుట్టుముట్టింది. అతను రెండుసార్లు స్టెరాయిడ్ పరీక్షల్లో విఫలమైనా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ ఇతర ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. సినెర్‌ను పోటీల్లో ఇంకా ఎలా ఆడనిస్తున్నారని ప్రశ్నించిన వారు... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శించారు.
ఈ ఏడాది మార్చిలో నిషేధిత అనబాలిక్ ఉ్రత్పేరకాన్ని తీసుకున్నందుకు రెండుసార్లు సినెర్ ‘పాజిటివ్’గా తేలాడు. అయితే మంగళవారం వరకు కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచారని, ఈనెల 26 నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌లో అతడిని ఎలా అనుమతిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు’ అంటూ షపవలోవ్ (కెనడా) ట్వీట్ చేయగా... ఇలాంటి పనికి నిషేధం తప్ప మరో శిక్షే లేదని నిక్ కిరియోస్ (ఆ్రస్టేలియా) తీవ్రంగా స్పందించాడు.
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సినెర్ జూన్‌లో వరల్డ్ నంబరవన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చేతికి గాయాలు తగిలినప్పుడు లేదా కోసుకుపోయినప్పుడు వాడే ఆయింట్‌మెంట్, స్ప్రేలలో ఉండే ‘క్లోస్టెబల్’ స్పోర్ట్స్ నిషేధిత జాబితాలో ఉంది. మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ సమయంలోనూ, టోర్నీ ముగిసిన వారం తర్వాత సినెర్ ఇచ్చిన శాంపిల్స్‌లో ఈ ఉత్రే్పరకం ఉన్నట్లు తేలింది. దాంతో ఈ టోర్నీలో సినెర్ సెమీస్ చేరడం ద్వారా వచ్చిన 3,25,00 డాలర్ల ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతోపాటు 400 పాయింట్లలో కూడా కోత విధించారు.
దీనిపై అప్పీల్ చేసిన సినెర్ తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని, దానిని వాడిన ఫిజియోథెరపిస్ట్ మసాజ్ చేసిన కారణంగా తన శరీరంలోకి ప్రవేశించిందని, ఇక ముందు అలా జరగకుండా డోపింగ్ నిబంధనలు పాటిస్తానని స్పష్టం చేశాడు. అతని వాదనను అంగీకరిస్తూ టెన్నిస్ ఇంటి గ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) సినెర్ తప్పేమీ లేదంటూ క్లీన్ చిట్ కూడా ఇచి్చంది. అయితే తాజాగా ‘దురదృష్టకర ఘటనను మరిచి ముందుకు సాగుతాను’ అని సినెర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది.
ఇలాంటి విషయాలను సాధ్యమైనని ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచి, అంతా మరచిపోయేలా చేస్తూ అగ్రశ్రేణి ఆటగాళ్లను రక్షించడం కొత్త కాదని... అదే ఏ 400వ ర్యాంక్ ప్లేయర్ అయిఉంటే అది సాధ్యం కాదని మాజీ ప్లేయర్, టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ కూడా అభిప్రాయపడింది. మున్ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment