
సాక్షి, హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సంజన సిరిమల్ల విజయం దూరంలో నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న రొలాండ్ గారోస్ వైల్డ్ కార్డు టోర్నీ బాలికల సింగిల్స్ విభాగంలో సంజన ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో సంజన 6–4, 7–5తో టాప్ సీడ్ రేష్మా మారూరి (కర్ణాటక)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో వైష్ణవి ఆడ్కర్ (మహారాష్ట్ర)తో సంజన ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఆ టోర్నీలో మెక్సికో, బ్రెజిల్, చైనా దేశాల నుంచి అర్హత సాధించిన క్రీడాకారిణులతో ఆడతారు. క్వాలిఫయింగ్ టోర్నీ విజేతకు మే–జూన్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలుర సింగిల్స్ సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ దేవ్ జవియా 6–2, 6–1తో నితిన్ సింగ్‌పై, మూడో సీడ్ చిరాగ్ 6–1, 6–0తో మోహిత్‌పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment