అత్యంత అద్భుత క్షణాలు: బుమ్రా | Jasprit Bumrah Shares Pics With Wife Sanjana Ganesan | Sakshi
Sakshi News home page

మీ ప్రేమకు ధన్యవాదాలు: బుమ్రా- సంజన

Published Fri, Mar 19 2021 2:55 PM | Last Updated on Fri, Mar 19 2021 5:28 PM

Jasprit Bumrah Shares Pics With Wife Sanjana Ganesan - Sakshi

ముంబై: ‘‘గడిచిన కొన్ని రోజులు జీవితంలో అత్యంత అద్భుత క్షణాలను మిగిల్చాయి. మాపై ప్రేమ కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు’’ అంటూ టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా భార్య సంజనా గణేషన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు. కాగా స్పోర్ట్ట్ ప్రజెంటర్‌ సంజనా- బుమ్రా గోవాలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో బుమ్రా తాజాగా తమ వివాహానంతర వేడుకకు సంబంధించిన ఫొటోలు నెటిజన్లతో పంచుకున్నాడు.

ఇక సంజన సైతం... ‘‘మీ విషెస్‌తో మా ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్న మీకు థాంక్యూ’’ అంటూ ఉద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశారు. ఇక ఈ ఫొటోల్లో వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్స్‌ ధరించి ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటున్న బుమ్రా- సంజూను చూసి.. ‘‘మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరిలాగే కలకాలం సంతోషంగా ఉండాలి’’ అంటూ ఫ్యాన్స్‌ మరోసారి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. 

కాగా కెరీర్‌ పరంగా టీమిండియా పేస్‌ దళానికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ల బుమ్రా... ఇప్పటి వరకు 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 83, వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 5 సార్లు టైటిల్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు అయిన సంజన, ఆ తర్వాత టీవీ ప్రజెంటర్‌గా అవతారమెత్తారు. ప్రపంచకప్‌, ఐపీఎల్‌ వంటి క్రికెట్‌ మెగా టోర్నీలు సహా ఇతర క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో భాగస్వామ్యమయ్యారు.

చదవండి: వైరల్: సంగీత్‌లో స్టెప్పులేసిన బుమ్రా- సంజూ!‌
బుమ్రానే బౌల్డ్‌ చేసింది.. ఎవరీ సంజన?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement