Is Jasprit Bumrah Going To Marry Sanjana Ganesan Or Anupama Parameswaran? - Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ కాదు: బుమ్రాను పెళ్లాడేది ఆమేనా!

Published Sat, Mar 6 2021 1:41 PM | Last Updated on Sat, Mar 6 2021 7:01 PM

Who is Jasprit Bumrah Bride Heroin Or Sports Journalist - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్న నాటి నుంచి టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ ఫాస్ట్‌బౌలర్‌ సెలవు తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బుమ్రాను వివాహమాడనున్న ఆ అమ్మాయి ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రముఖ హీరోయిన్‌ అనుపమా పరమేశ్వర్‌ను బుమ్రా వధువుగా పేర్కొంటూ ఇప్పటికే గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేసిన సంగతి తెలిసిందే. బుమ్రా తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని గతంలో ప్రకటించిన అనుమప.. ఇటీవల అతడి స్వస్థలం గుజరాత్‌ను సందర్శించిన ఫొటోలు షేర్‌ చేయడంతో ఈ మేరకు వదంతులు ప్రచారమయ్యాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో యువతి పేరు తెర మీదకు వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7 తో కెరీర్‌ ఆరంభించారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఆమె, ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం, పరిణయానికి దారి తీసిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు.. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య బుమ్రా గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నాడని వినికిడి. అ‍యితే వధువు ఎవరన్న విషయంపై మాత్రం ఇంతవరకు సస్పెన్స్‌ వీడటం లేదు! అయితే, హాలిడే మూడ్‌లో ఉన్నానంటూ అనుపమ, బుగ్గలకు పసుపు, కుంకుమ రాసుకున్న ఫొటో షేర్‌ చేయడంతో మెజారిటీ మంది అనుపమే ఆ లక్కీ గర్ల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండిఆ హీరోయిన్‌ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement