43 ఏళ్ల వయస్సులో సరికొత్త చరిత్ర.. రోహ‌న్ బొప్ప‌న్న పై సచిన్‌ ప్రశంసలు | Sachin Tendulkar Pens Warm Note For Oldest No.1 Ranked Tennis Player Rohan Bopanna, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

#Rohan Bopanna: 43 ఏళ్ల వయస్సులో సరికొత్త చరిత్ర.. రోహ‌న్ బొప్ప‌న్న పై సచిన్‌ ప్రశంసలు

Published Wed, Jan 24 2024 6:24 PM | Last Updated on Wed, Jan 24 2024 6:47 PM

Sachin Tendulkar Pens Warm Note For Oldest No.1 Ranked Tennis Player Rohan Bopanna - Sakshi

సచిన్ టెండూల్కర్, రోహన్ బోపన్న

భార‌త టెన్నిస్ స్టార్ రోహ‌న్ బొప్ప‌న్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వృద్ధ వ‌య‌సులో  పురుషుల డబుల్స్‌లో నెం1 ర్యాంక్‌ను అందుకున్న టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 43 ఏళ్ల వయస్సులో రోహ‌న్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌  క్వార్టర్‌ డబుల్స్‌లో విజయనంతరం బోపన్న నంబర్‌ వన్‌గా నిలిచాడు.

బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో అర్జెంటీనా జోడీ మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రెస్ మోల్టెనీని మాథ్యూ ఎబ్డెన్-బోపన్న జోడి చిత్తు చేసింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో బొప్ప‌న్న జోడి 6-4, 7-6 స్కోరుతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇక లేటు వయస్సులో వరల్డ్‌నెం1గా నిలిచిన బొప్ప‌న్నపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సైతం రోహన్‌ ప్రశంసించాడు.

"వయస్సు ఒక సంఖ్య మాత్రమే. కానీ 'నంబర్ 1' అనేది మరొక సంఖ్య కాదు. అభినందనలు రోహన్! పురుషుల డబుల్స్‌లో ఈ వయస్సులో నెం1గా నిలవడం నిజంగా గ్రేట్‌"అని ఎక్స్‌(ట్విటర్‌)లో సచిన్‌ రాసుకొచ్చాడు.
చదవండిబజ్‌బాల్‌తో మాకు సంబంధం లేదు.. గెలవాలంటే అదొక్కటే: రోహిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement